ప్రపంచాన్ని డ్రగ్స్ ప్రస్తుతం కుదిపేస్తున్నది..చాలా మంది తెలియకుండానే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి మాట్లాడారు. ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం అన్నారు. చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసులకే ఉందన్నారు. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయన్నారు. సమాజంలో ఉన్న డ్రగ్స్ మాఫియా నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.