Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తల్లి జన్మనిస్తే..గురువులు బతుకు నేర్పిస్తారు…

విశాలాంధ్ర - హైదరాబాద్‌ : కన్నతల్లి మనకు జన్మనిస్తే గురువులు బతుకును నేర్పిస్తారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యా యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న సబిత మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో నైతిక, మానవతా విలువలు పెంపొందించాలని సూచిం చారు. కొవిడ్‌ కారణంగా చాలా రంగాలు నష్టపోయాయి, విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని తిరిగి గాడిన పెటేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను ప్రభు తీసుకుంటుం దన్నారు.  గురుకులాల్లో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్య అందుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2.50 లక్షల మంది చేరారు. 1.20 లక్షల మంది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బడ్జెట్‌లో విద్యావ్యవస్థకు రూ.4 వేల కోట్లు కేటాయించారు అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ :ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. దేశంలో ఎంతో మంది ఉపాధ్యాయులు అనేక గొప్ప గొప్ప పదవులను అధిరోహించిన వారు ఉన్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణ ముఖ్యులని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలకు ఓర్చుకుని చదివి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవ చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. స్వార్థాన్ని విడిచి అందరి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు. అంతే కాక అబ్దుల్‌ కలాం లాంటి వారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మనం బ్రతకడంతో పాటు మరికొంత మందిని బతికించాలని, పది మంది కోసం పని చేసిన వాళ్ళు సమాజంలో మహానుభావులుగా మిగిలిపోతారని, అలాంటి పవిత్రమైన వృత్తిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమాజానికి అవసరమైన ఉన్నత వ్యక్తులను తీర్చి దిద్దే కర్మాగారాలు అని కొనియాడారు. ప్రపంచాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అయితే విద్యార్థులకు చదువుతోపాటు, సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందని, కుల నిర్మూలనపై చిన్నప్పటి నుండి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలలో కుల వ్యవస్థ ఒకటి అని ఆయన అన్నారు. నవ సమాజ నిర్మాణం ,సమాజ మార్పు ఉపాధ్యాయుల పై ఆధారపడి ఉందని, అందువల్ల ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట రావు మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ గురువెనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం తోపాటు, దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తీర్చి దిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.సి.నర్సింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఘట్‌కేసర్‌ : ఈ దేశ భవితను నిర్ణయించేది తరగతి గదియేనని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని చౌదరిగూడకు చెందిన రమేష్‌ అనే ఉపాధ్యాయున్ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైనదని, విద్యార్థులను ఉత్తమలుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ కౌన్సిలర్‌ మేకల పద్మారావు, సహకార సంఘం డైరెక్టర్‌ చందుపట్ల ధర్మారెడ్డి, టిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు బాలు యాదవ్‌, పాల్గొన్నారు.
హైదరాబాద్‌ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లెపల్లి ఐటిఐలో విద్యార్థులు సిబ్బందిని సన్మానం చేసి జాతీయ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన తెలిపారు. ఎం.బి.కృష్ణ యాదవ్‌ మాట్లాడుతూ..భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులదని, పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదన్నారు. కరోనా క్లిష్ట సమయంలో భౌతిక తరగతులు లేకున్నా ఆన్లైన్‌ క్లాస్‌లతో బోధనకు అంత రాయం కలగకుండా ఉపాధ్యాయులు కృషి చేశారన్నారు. విద్యాలయాలు పునఃప్రారం భమైనందున ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img