Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

తల్లీబిడ్డల క్షేమం కోసమే ఈ కిట్‌ : హరీశ్‌రావు

తెలంగాణలోకి ప్రతిబిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే కాంక్షతో సీఎం కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌ను అందిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తల్లి స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకే పుట్టిన బిడ్డగా చెప్పవచ్చన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.కామారెడ్డి జిల్లా కలేక్టరేట్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆరోగ్య వైద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ రూపొందించారని తెలిపారు. తల్లీ, బిడ్డ బాగుండాలని న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రొటీన్‌ డైట్‌ ఉంటుందన్నారు. ప్రతి కిట్‌ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడిరచారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తామన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.పౌష్టికాహార కిట్‌తో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img