Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల రిమాండ్‌


ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్‌ కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న)కు సికింద్రాబాద్‌ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. శనివారం మల్లన్నను సికింద్రాబాద్‌ కోర్టులో హాజరుపరిచారు. సికింద్రాబాద్‌ మధురానగర్‌ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్‌ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వచ్చే నెల 9 వరకు మల్లన్నకు రిమాండ్‌ విధించారు. ఇక సిటీ సివిల్‌ కోర్టులో మల్లన్న బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img