Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారు

రాహుల్‌ గాంధీ, జేపీ నడ్డాల పర్యటనలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వీరిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారంటూ కవిత ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రానికి వస్తుంటారని.. రాష్ట్రానికి వీరు చేసిందేమీ ఉండదని అన్నారు. రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభ కేవలం రాజకీయాల కోసమేనని విమర్శించారు. రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కవిత మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img