కేంద్రానికి హరీశ్‌రావు లేఖ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం మరోసారి లేఖ రాశారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయడంతో పాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడగించాలని కోరారు. నీతి ఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు ఇవ్వాలన్నారు.స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించిందని, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్ధిష్ట కారణం లేకుండా గ్రాంట్లను తిరస్కరించారన్న ఆయన వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయాలన్నారు.2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని, ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని, దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఇంకా తెలంగాణకు సర్దుబాటు చేయలేదని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణకు విడుదల చేయాలని, వీటితోపాటు పెండిరగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210కోట్లను కూడా సర్దుబాటు చేయాలని కోరారు.