రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. గడచిన 24 గంటల్లో 2,447 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.అధికారిక సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,112, రంగారెడ్డి జిల్లాలో 183, మేడ్చల్ జిల్లాలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, కేవలం జంట నగరాల పరిధిలోనే సగానికి ఎక్కువ కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కల్గిస్తోంది. ప్రజలు, వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది లో 119 మంది కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రిలలో మొత్తంగా 159 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు మొత్తంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2200 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.