Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

తెలంగాణలో జికా వైరస్‌ కలకలం

దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. ఐసీఎంఆర్‌,పూణేలోని ఎన్‌ఐవీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది కేరళలో అలజడి సృష్టించిన జికా వైరస్‌.. తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు వ్యాపించినట్లు అధ్యయనంలో తేలింది. కేరళ, తెలంగాణతో పాటు ఢల్లీి, జార్ఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించినట్లు అధ్యయనం వెల్లడిరచింది.2021 మే నుంచి అక్టోబర్‌ వరకు దేశంలోని 13 రాష్ట్రాల్లో ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల మైక్రోబయాలజీ విభాగం నుంచి నమూనాలను సేకరించి పరిశీలించారు. మొత్తం 1,475 నమూనాలను పరిశీలించగా.. 64 నమూనాల్లో జికా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ 64 నమూనాల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి సేకరించిన ఒక శాంపిల్‌ ఉన్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో జికా వైరస్‌ నిశబ్దంగా వ్యాపిస్తోందని పరిశోధకులు వెల్లడిరచారు. ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ వైరస్‌తో పాటు జికా వైరస్‌ లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ను కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జికా వైరస్‌ వ్యాప్తిపై చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
గతేడాది కేరళలో 66 జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇది కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. అయితే, కరోనా వైరస్‌ మాదిరిగా జికా వైరస్‌కు సంబంధించి సమగ్ర అవగాహన గానీ, సమాచారం గానీ అన్ని రాష్ట్రాల వద్ద లేదు. ఈ వైరస్‌ను గుర్తించడం ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్లు హైదరాబాద్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఎపిడెమియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ బి.ఆర్‌. షమన్న అన్నారు. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img