Friday, August 12, 2022
Friday, August 12, 2022

తెలంగాణలో త్వరలో వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు: మంత్రి కేటీఆర్‌

మున్సిపల్‌ శాఖ వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 2021-22 సంవత్సరానికి గాను పురపాలక శాఖ వార్షిక నివేదికను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. 50 వేల జనాభా కలిగివున్న ప్రతి మున్సిపాలిటీలో త్వరలోనే వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడిరచారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ పోస్టు ఉంటుందన్నారు.
రాష్ట్రంలో 141 మున్సిపాలిటీల పరిధిలో రూ.3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్‌ వివరించారు. అంతేకాదు, అన్ని పట్టణాల్లోనూ 10 అంశాలతో కూడిన ప్రత్యేక అజెండా అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దేశంలోనే రెండోస్థానంలో ఉందని తెలిపారు. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img