Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్‌ ప్రాజెక్టు.. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడానికి కాస్తంత ముందుగా ప్రాజెక్టు వివరాలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిరచారు.ఈ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్‌ రెడ్డి వెల్లడిరచారు. 100 మోగావాట్ల సామర్థ్యంలో రూ.423 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా క్రింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్‌ ప్యానెళ్లతో 40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి జరగనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ ను సరఫరా చేయవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img