Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేయడంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.. హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులపై ఈ మంచు దుప్పటి విపరీతంగా కప్పేస్తుంది. జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. పొగమంచుతో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి మంచు దుప్పటితో కప్పేస్తుంది. వాహనదారులు రహదారి కానరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img