Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

తెలంగాణలో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం

తెలంగాణలో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు ఈ ప్రకంపనలు సంభవిచాయి. రిక్టర్‌స్కేల్‌పౖౖె 4 తీవ్రతగా నమోదయింది. కరీనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాలలోని రాంనగర్‌, గోసేవ మండల్‌ కాలనీ, నస్పూర్‌లో స్వల్పంగా భూమి కంపించింది.దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రామగుండం, పెద్దపల్లిలో భూమి కంపించింది. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img