తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ప్రధాని మోదీని తిట్టే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలేనని అన్నారు. భాష మార్చుకోవాలని కేసీఆర్‌కు పలుమార్లు చెప్పానన్నారు.ఎవరినైనా కొంటా.. ఏదైనా చేస్తా.. అనే అహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. జవాన్లను కూడా కించ పరిచేలా కేసీఆర్ మాట్లాడారన్నారు.