తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో సమీక్షించారు. అన్ని జిల్లాల ఈసీలతో సీఈవో వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వారం పార్టీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించి క్లైమ్లు, అభ్యంతరాలను తెలియచేయాలని సీఈవో ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి మాస్టర్ లెవల్ ట్రైనర్లను గుర్తించాలని సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈవీఎంల పనితీరును జూన్ 1 నుంచి పరిశీలిస్తామని సీఈవో ప్రకటించారు. ఎలక్టోరల్ రోల్‌ను ఏప్రిల్ 30 వరకు పూర్తి చేసి ప్రచురించాలని ఆదేశించారు వికాస్ రాజ్. ఓ వైపు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది.