Friday, December 2, 2022
Friday, December 2, 2022

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉంది : మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్‌ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందంటూ ఇవాళ ట్విటర్‌లో మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్‌ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి ఆ ప్రతిష్టాత్మక జాతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమైనట్లు కేటీఆర్‌ విమర్శించారు. గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషినల్‌ మెడిసిన్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆయుష్‌ మంత్రిత్వశాఖ భావిస్తోందని, ఈ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల.. అది నగరాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందని గతంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సెంటర్‌ జామ్‌నగర్‌కు వెళ్లడంతో కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సెటైర్‌ వేశారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్రానికి తీసుకువచ్చినందుకు థ్యాంక్స్‌ చెబుతున్నట్లే చెప్పిన మంత్రి కేటీఆర్‌.. కాస్త ఆగండి.. గుజరాత్‌ ప్రధాని ఆ కేంద్రాన్ని జామ్‌నగర్‌కు తీసుకువెళ్లినట్లు తన ట్వీట్‌లో కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ వివక్ష ఓ ధారావాహికంలా సాగుతోందని, తెలంగాణకు నిరాటంకంగా అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మంజూరీ చేసిన జాతీయ ఇన్స్‌టిట్యూట్ల వివరాలను కూడా మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img