Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాది : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. కొంగరకలాన్‌ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తానని అన్నారు. ‘ఒక ఇల్లు కట్టాఅలంటే చాలా సమయం ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. మూఢనమ్మకాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాటన్నింటిని రెండు మూడు రోజుల్లో కూలగొట్టొచ్చు. ఎంత కష్టమైతది. శిథిలమైపోతది. 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.’ మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామన్నారు. పంటల తెలంగాణ కావాలా ? మంటల తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్‌ స్టేట్‌ గా ఉండేవాళ్లమన్నారు. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్‌ లో భాగమయ్యామన్నారు. తొలిదశ ఉద్యమంలో 400మంది విద్యార్థులు చనిపోయారన్నారు. తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img