Monday, September 26, 2022
Monday, September 26, 2022

తెలంగాణ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు విడుదల..

న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రవీందర్‌ యాదవ్‌, లా సెట్‌ కన్వీనర్‌.. జిబి రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img