బండి సంజయ్ చేసిన 317 జీవోను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో పోలీసులు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.. దీనిపై బండి సంజయ్ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. .బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారాయణ సహా బాధ్యులైన ఇతర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. ీ. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.