Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పదిమంది అరెస్ట్‌ : సీపీ

తెలుగు అకాడమీకి సంబంధించిన కేసులో ఇప్పటి వరకు కేసుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడిరచారు.ఈ స్కామ్‌లో మూడు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.64.50కోట్లు ఎఫ్‌డీ నిధులను విత్‌డ్రా చేసినట్లు విచారణలో గుర్తించినట్లు తెలిపారు. యూబీఐ కార్వాన్‌ శాఖ నుంచి రూ.26కోట్లు, యూబీఐ సంతోష్‌నగర్‌ శాఖ నుంచి రూ.11కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌లో రూ.6 కోట్లు ఎఫ్‌డీలు స్వాహా చేసినట్లు గుర్తించామని సీపీ చెప్పారు. గతేడాది డిసెంబర్‌ నుంచి సెప్టెంబర్‌ 21 వరకు ఎఫ్‌డీల సొమ్ము కాజేశారన్నారు. స్కామ్‌లో కీలక నిందితుడు సాయికుమార్‌పై గతంలో మూడు కేసులున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img