: మంత్రి ఎర్రబెల్లి
ప్రణాళికాబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దటానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంచి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కౌన్సిలర్లు వారి వారి వార్డులలో పర్యటించి, సమస్యలను పరిష్కరంచాలన్నారు.పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను మరింత అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ ను మరింత మెరుగు పరచాలని చెప్పారు. ఈ సమావేశంలో సమావేశంలో..మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.