Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇంకా తగ్గలేదు

డీహెచ్‌ శ్రీనివాసరావు
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు చెప్పారు. సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇంకా తగ్గలేదన్నారు. పాజిటివ్‌ వచ్చినవారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయని, కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్రం నుంచి అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయని, ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. కరోనా మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img