Monday, August 15, 2022
Monday, August 15, 2022

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మే 24 నుంచి ఆరు రైళ్లు రద్దు..

సికింద్రాబాద్‌-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతున్నందున పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 6 నుంచి 17 వరకు మరో ఆరు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు-సూళ్లూరుపేట్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-సత్రగచీ స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేశారు. దోన్‌ గుంటూరు స్టేషన్ల మధ్య రెండు రైళ్ల సమయాలను రీషెడ్యూల్‌ చేసినట్లు పేర్కొన్నారు.ఇక ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు శాలీమార్‌-చీరాల, హతియా-చీరాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, జబల్‌పూర్‌, నాందేడ్‌ స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.హౖదరాబాద్‌-జైపూర్‌ స్టేషన్ల మధ్య 16 సమ్మర్‌ వీక్లి ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్‌ 26వ తేదీ వరకు నడుపనున్నట్లు రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌సీఆర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img