Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

దమ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు..

బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్‌
దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలువాలని కేటీఆర్‌ బండి సంజయ్‌కి సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లాలో రూ. 1,067 కోట్ల పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. కరీంనగర్‌ను ఒక లక్ష్మీనగరంగా సీఎం చూస్తారు. ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని కేసీఆర్‌ నమ్ముతారు. మే 17, 2001న సింహగర్జన సభ పెట్టి తెలంగాణ సాధనకు నాంది పలికారు. తెలంగాణ వచ్చింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్‌ ఉండే. ఇప్పుడు ఆసరా పెన్షన్ల కింద రూ. 2016లు ఇస్తున్నాం. ఆసరా పెన్షన్లు పెద్ద మనషుల్లో ఆత్మగౌరవం తీసుకొచ్చింది. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది మాత్రమే అని అన్నారు. కరీంనగర్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ కేటాయించాం. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతున్నది అని కేటీఆర్‌ తెలిపారు. రూ. 1067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కరీంనగర్‌కు ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండేది. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. 50 వేల కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తామన్నారు. కరీంనగర్‌ ఎల్‌ఎండీ వద్ద అద్భుతమైన తీగల వంతెనను నిర్మించారు. రూ. 410 కోట్లతో సదాశివపల్లి దాకా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్‌ కుమార్‌ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్‌ సిటీ స్టేటస్‌ కరీంనగర్‌కు వచ్చింది. గెలిచి మూడేండ్లు అయింది. కనీసం కరీంనగర్‌ పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img