Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

దిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌తో భేటీ
పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై హస్తిన పర్యటన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణ్షామాలు, ప్రధాన పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, అరెస్టుల నేపథ్యంలో ఆమె ఢల్లీికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. సంజయ్‌ పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా చూడాలని ఆమెను కోరారు. ఆ మరుసటి రోజు గవర్నర్‌ తమిళిసై దిల్లీకి పయనం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు ఉత్కంఠగా మారుతున్న తరుణంలో తమిళిసై హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రుల్లో ఎవరెవరిని కలవబోతున్నారు, ఎలాంటి చర్చలు జరగబోతున్నాయని అనేది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img