Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దీక్షలు, ధర్నాలతో తెలంగాణ సర్కారు డ్రామాలు : షర్మిల

రైతులను ఆదుకోవాల్సిన తెలంగాణ సర్కార్‌ దీక్షలతోతో, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని ౖ వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. ఏ దిక్కూ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగుతున్నారని, రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని అన్నారు. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. దిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే సీఎం..మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం సమయం కూడా లేదా? అని ప్రశ్నించారు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రైతును అప్పులపాలు చేస్తున్న సీఎం మనకొద్దని, రైతు ఆవేదన తీర్చలేని సీఎం కేసీఆర్‌ మనకొద్దని షర్మిల అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img