Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 3 రోజుల పాటు రాకపోకలు బంద్

హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు సాగించేవారికి అలెర్ట్. 3 రోజుల పాటు బ్రిడ్జిపై రాక‌పోక‌లు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 6న అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 10 ఉదయం 6 గంటల వరకు బ్రిడ్జిపై రాకపోకలు మూసేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. బ్రిడ్జి మెయింటెనెన్స్‌లో భాగంగా అత్యంత భారీ యంత్రాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. బ్రిడ్జి బ‌రువును ప‌రిశీలించేందుకు గానూ ూ1, ూ2 పైలాన్ల వద్ద 100 ట‌న్నుల బరువున్న క్రేన్లను ఉంచ‌నున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో రాక‌పోక‌లు కొన‌సాగించే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని సూచించారు.జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు ఆ రూట్లలో ప్రయాణించే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులను డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ వద్ద రోడ్డు నెం 45 కుడివైపు మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రూట్లలో వచ్చే వాహనాలు మాదాపూర్ పోలీసు సేష్టన్ వైపు వద్ద లెప్ట్ టర్న్ తీసుకొని జూణ జంక్షన్ – సైబర్ టవర్ల వద్ద మళ్లీ లెప్ట్ టర్న్ తీసుకొని లెమన్ ట్రీ జంక్షన్ మీదగా ఐకియా రోటరీ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలను ఇనార్బిటాల్ మాల్ వద్ద మళ్లించున్నారు. ఈ రూట్లలో వచ్చే వాహనదారులు ఇనార్బిటాల్ మాల్ వద్ద లెప్ట్ టర్న్ తీసుకొని ఐ ల్యాబ్స్ – దుర్గం చెరువు – నెక్టర్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లీ రైట్ టర్న్ తీసుకొని డాక్టర్స్ కాలనీ -డీ మార్ట్ వద్ద యా టర్న్ తీసుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో వాహనదారులు ప్రత్యా్మ్నాయ మార్గాలను పోలీసులు ఎంచుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img