Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి

సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌

విశాలాంధ్ర, సిద్దిపేట ప్రతినిధి: దొడ్డి కొమురయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. దొడ్డి కొమురయ్య76వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవనంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించి ఆనాటి దొరలకు వ్యతిరేకంగా పోరాడి వీర మరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని వారు కొనియాడారు. కడవెండి గ్రామంలో విసునూరు దొరకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వం లో జరిగిన ఆనాటి పోరాటం లో వేలాది ఎకరాల భూమి పేద ప్రజలకు పంచినట్లు తెలిపారు. దొరల కబంధ హస్తముల నుండి చాకలి ఐలమ్మ పంట పొలాన్ని కాపాడిన ఘనత దొడ్డి కొమురయ్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి పాండు రంగాచారి,సీపీఐ నాయకులు కనుకుంట్ల శంకర్‌, మన్నే కుమార్‌, వేణు, ప్రేమ్‌, బాలకృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు
విశాలాంధ్ర,రాజన్న సిరిసిల్ల,వేములవాడ : సోమవారం రోజు వేములవాడ పట్టణం విలీన గ్రామమైన తిప్పాపూర్‌ 6 వ వార్డ్‌ లో కౌన్సిలర్‌ నీలం కళ్యాణి శేఖర్‌ ఆధ్వర్యంలో 14 వ ఆర్థిక సంఘం నిధులు 5లక్షల రూపాయలతో సిసి రోడ్డుకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్‌ బాబు సహకారంతో వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని పట్టణ అభివృధే ధ్యేయంగా మా మున్సిపల్‌ పాలకవర్గం పనిచేస్తుందని వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి మా పాలకవర్గం కట్టుబడి ఉందని మనకు వచ్చిన 20 కోట్ల నిధుల లో ప్రతి ఒక్క వార్డుకు దాదాపు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని విలీన గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి పనులు చేస్తునమని ప్రజల సహకారం ఉంటేనే త్వరితగతిన సమస్యలను పూర్తి చేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌ రావు,వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, 7వార్డు కౌన్సిలర్‌ జోగిని శంకర్‌,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
‘పది’లో గోపీ మెమోరియల్‌ హైస్కూల్‌ విద్యార్థుల ప్రభంజనం
విశాలాంధ్ర, కాప్రా : పదవ తరగతిలో 10/10 శాతం మార్కులు సంపా దించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన కుషాయి గూడ గోపీ మెమోరియల్‌ హై స్కూల్‌ విద్యార్దులను సంస్థ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. పూజిత ,లక్ష్మి ప్రసన్న , సమీర్‌ , శృతి, నలుగురు విద్యార్ధినులు 10/10 సంధించారు. ఈ మేరకు యాజమాన్యం వారిని అభినందించి, వారితో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అదేవిదంగా పూర్వపు విద్యార్థులు భవ్యరెడ్డి ( ఎం.పి. సి ) నారాయణ కాలేజ్‌, స్పేట్‌ 2 వ నర్యాంకు , పూజిత ( బీ పి సి ) శ్రీ గాయత్రీ కాలేజ్‌, ఔట్‌ 7వ ర్యాంకు, ముఖేష్‌ కుమార్‌ ( ఈ ఈ ఈ) సంస్కృతి కాలేజ్‌, సాయి పవన్‌ కుమార్‌ ( బిపిసి ) స్టేట్‌ 3 వ ర్యాంకు సాధించడంతో వారిని కూడ ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని సూచించారు. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌ హెడ్మాస్టర్‌ కృష్ణారెడ్డి , వైస్‌ ప్రిన్సిపాల్‌ సుమలతా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు , ప్రేమ్‌ కుమార్‌, పూజిత , నాయుడు , సరస్వతి సల్మాన్‌, షరీఫ్‌ , శైలజ, శ్రీదర్‌ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
విశాలాంధ్ర, హైదరాబాద్‌ : మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో సోమవారం కాచిగూడలోని రాజేంద్ర కాలనీ కమ్యూనిటి హాల్‌లో మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్‌ చట్టపరమైన విషయాలపై అవగాహన కల్పించారు.మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి పాపి రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ (పేదరిక నిర్మూలన పథకాల ప్రభావవంతమైన అమలు) పథకం`2015 గురించి సమావేశానికి హాజరైన వారికి వివరించారు. అలాగే లా విద్యార్థులు వారి అనుభవాలని, సూచనలని, అక్కడికి వచ్చిన వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతలో పాటు రాజేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్‌ అధ్యక్షులు గోదావరి, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ అఫ్‌ లా పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.
నేడు ఏబీవీపీి బంద్‌
విశాలాంధ్ర -అమనగల్లు : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నేడు పాఠశాలల బంద్‌ కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి గోరటి నర్సింహా పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన నగర శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 5న జరిగే బందు ను విద్యార్థులు, తల్లిదండ్రులను, ప్రభుత్వ, ప్రవేట్‌ పాఠశాలలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లండం మల్లేష్‌, సంయుక్త కార్యదర్శి కొట్ర సురేష్‌, మోక్తల సాయి, ఏబీవీపీ నాయకులు శెట్టిమల్ల శంకర్‌, రాముల సాయి, శివచారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img