Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ధీరవనిత చాకలి ఐలమ్మ : మంత్రి వేముల

నాటి భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌, పడిగెల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాంచన్‌ దొరా కాల్మొక్కుతా అనే స్థితిలో ఉన్న పీడితులతో బందూకులు పట్టించి దొరలను గడగడలాడిరచిన ఘనత ఐలమ్మదని పేర్కొన్నారు.. దొరల దాష్టీకాలపై సివంగిలా గర్జించిన ఐలమ్మ నడుముకు కొంగుచుడితే, దొరతనం తోక ముడిచిందన్నారు.అంతటి వీర వనిత విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img