Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

నల్గొండ జిల్లాకు మూడు ఎత్తిపోతల పథకాలు

నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేములపల్లి వద్ద తోపుచర్ల ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది. రూ. 9.3 కోట్లతో దీన్ని నిర్మించాలని నిర్ణయించింది. దామరచర్ల మండలం తుండపాడువాగుపై మరో ఎత్తిపోతలను, రూ.322.22 కోట్లతో వీర్లపాలెం రెండోదశ ఎత్తిపోతల పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.కట్టంగూరు మండలం చెరువు అన్నారం వద్ద రూ. 101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి అనుమతులిచ్చింది.రూ.664.80 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతలకు కొత్తగా నీటిపారుదలశాఖ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img