Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పైలెట్‌, శిక్షణ పైలెట్‌ మృతిచెందారు. శిక్షణనిచ్చే విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు, పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానిక రైతులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img