నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.