Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

నా జోలికి రావద్దు.. నీ అవినీతి చిట్టా మొత్తం విప్పుతా

కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమిషన్ల కుటుంబమని విమర్శించారు. తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మీ అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని… తన జోలికి వస్తే మీ అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. తమను ఉద్దేశించి వాళ్లు కోమటి రెడ్లు కాదు… కోవర్టు రెడ్లు అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న తాము కోవర్టులమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ ఎక్కుడున్నారని అడిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img