Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

నా విషయంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు, మీడియాకు తెలుసు

గవర్నర్‌ తమిళిసై
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ప్రొటోకాల్‌ వివాదంతో పాటు.. పలు అంశాలను అమిత్‌షాకు వివరించినట్లు చెప్పారు. తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు, మీడియాకు తెలుసని అన్నారు. తానేప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానన్నారు. తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమేనని తెలిపారు. తెలంగాణలో గవర్నర్‌ ప్రయాణించాలంటే రోడ్డుమార్గమే దిక్కని, గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. తాను ఏమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? బీజేపీ కార్యకర్తలను వెంటేసుకొని వెళ్లానా? అని ప్రశ్నించారు.సీఎస్‌ వచ్చి సమస్య ఏంటో తనతో మాట్లాడాలని తమిళిసై అన్నారు. తనను బీజేపీ కార్యకర్త అని ఎలా అంటారని తమిళి సై ప్రశ్నించారు. తాను అన్నిపార్టీల నేతలను కలిశానని, ఏదైనా ఉంటే.. అడిగితే.. సమాధానం చెబుతానన్నారు. గణతంత్ర, ఉగాది వేడుకలకు వారు ఎందుకు రాలేదని నిలదీశారు. ఇదేనా వారు ఇచ్చే మర్యాద?.. సీఎం కేసీఆర్‌ సహా అందరినీ ఆహ్వానించానని.. ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. ఇది తమిళిసై సమస్య కాదని.. గవర్నర్‌ ఆఫీస్‌కు జరుగుతున్న అవమానమని అన్నారు. ఈ న

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img