Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

నిలకడగా సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్‌ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. చిరంజీవి , పవన్‌ కళ్యాణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ , నిహారిక, మెగాస్టార్‌ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. సాయిధరమ్‌ కండిషన్‌ బాగానే ఉందని..త్వరలోనే కోలుకుంటాడని..అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం అల్లు అరవింద్‌ చెప్పారు. కాగా అతివేగం కారణంగానే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img