రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన హక్కు కాదా? అని వైఎస్ఆర్టీసీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనన్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్టేనని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌లో చలనం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.