Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

నూకలు తినమని చెప్పిన పార్టీకి తోకలు కత్తిరించాలి : మంత్రి కేటీఆర్‌

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.బీజేపీ పార్టీకి చెందిన గల్లీ నాయకులు ఒక మాట, ఢల్లీి నాయకులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమయాన్ని సృష్టించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎవరిది తెలివి తక్కువతనం.. మీ కేంద్రానిదా? తెలంగాణ రైతులదా? అని కేటీఆర్‌ నిలదీశారు. బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమన్నారు. నూకలు తినమని చెప్పిన పార్టీకి తోకలు కత్తిరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
‘ఎండకాలంలో మనం పండిరచే వరి పంటను కొనాలని అడిగితే.. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. మీ బియ్యం తినమని పీయూష్‌ గోయల్‌ అంటున్నాడు. నూకలు తినడం నేర్పించండని వెటకారంగా మాట్లాడిరడు. మంత్రులను మీకేం పనిలేదా అని అవమానపరిచిండు. ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. సంవత్సరానికి కోటి మెట్రిక్‌ టన్నుల పైచిలుకు ఉప్పుడు బియ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా 80 నుంచి 90 దేశాలకు కేంద్రం ఎగుమతి చేస్తున్నది. కానీ పీయూష్‌ గోయల్‌ సిగ్గు, లజ్జ లేకుండా అబద్ధాలు చెబుతూ.. ఉప్పుడు బియ్యం కొనడం లేదని చెప్తుండు. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేంద్రమంత్రి మాట్లాడుతుండు. యాసంగిలో వరి సాగు చేయమని రైతులను బండి సంజయ్‌ రెచ్చగొట్టాడు.. కేంద్రాన్ని ఒప్పించి ప్రతి గింజను కొంటామని చెప్పిండు. కానీ ఇప్పుడేమో ముఖం చాటేశాడు. కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పాడు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రతో కొనిపిస్తామని కిషన్‌ రెడ్డి చెప్పాడు.. ఆయన కూడా పత్తా లేడు.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img