Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

నెట్టింట వైరల్‌ అవుతున్న హరీష్‌రావు బోటింగ్‌ వీడియో

భార్యకు తామర పువ్వు అందించిన మంత్రి..
బతుకమ్మ పండుగను సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి హరీష్‌ రావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు తన భార్యాపిల్లలతో కలిసి సరదాగా కోమటి చెరువులో బోటుపై షికారుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి బోటు అలా సాగుతుండగా ఓ తామర పువ్వు కనిపించగానే.. దానిని అందుకునేందుకు హరీశ్‌ రావు సతీమణి యత్నించగా.. స్టీరింగ్‌ తిప్పుతూనే అలా వంగిన హరీశ్‌ రావు ఆ పువ్వును అందుకుని తన సతీమణి చేతికి అందించారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.. హరీశ్‌ రావు పర్సనల్‌ అసిస్టెంట్‌ (పీఏ) రాంచందర్‌ రావు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు వీనుల విందైన ఓ సినీ పాటను యాడ్‌ చేసి మరీ పోస్ట్‌ చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img