Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

నేడు ఈడీ విచారణకు హాజరవుతున్న తరుణ్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ ముందుకు నటుడు తరుణ్‌ హాజరు కానున్నారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను నేడు విచారించనున్నారు.బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఎఫ్‌ లాంజ్‌ పబ్‌ వ్యవహారాలు, నవదీప్‌ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img