Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

నేడు తెలంగాణలో పర్యటించనున్న పంజాబ్‌ సీఎం

జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న పంజాబ్‌ సీఎం
చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యామ్‌ ల నిర్మాణాలను అధ్యయనం చేయనున్న సీఎం
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ కు చేరుకున్న ఆయన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌ కి బయలుదేరుతారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌, మల్లన్నసాగర్‌, మర్ముక్‌ పంప్‌ హౌస్‌, పాండవుల చెరువును ఆయన పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాజెక్టు వల్ల భూగర్భజలాల పెరుగుదల, మిషన్‌ కాకతీయ గురించి పంజాబ్‌ సీఎం బృందానికి అధికారులు తెలియజేయనున్నారు.భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను భగవంత్‌ మాన్‌ బృందం పరిశీలించనుంది. మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యామ్‌ ల నిర్మాణం తదితర పనులను అధ్యయనం చేయనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ కు తిరిగిరానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img