Friday, October 7, 2022
Friday, October 7, 2022

నేతి బీరకాయలో నీతి ఎంత ఉందో..నీతి అయోగ్‌లో నీతి కూడా అంతే.. : కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌ కేంద్రానికి భజన సంస్థలా మారిందని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆరోపిస్తోంది. కాగా కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై ఉండాల్సిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయబారం విఫలం అవుతుందని తెలిసినా కురుక్షేత్రం అనివార్యమని తెలిసినా శ్రీకృష్ణుడు తన కర్తవ్యంగా రాయబారానికి వెళ్లిన దృష్టాంతాన్ని కేసీఆర్‌ ఆచరణలో పెట్టాల్సిందని.. ప్రధాని, ముఖ్యమంత్రుల సమక్షంలో నీతి ఆయోగ్‌ సమావేశంలోనే కేసీఆర్‌ ప్రశ్నించాల్సిందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ట్వీట్‌ చేశారు.‘‘అయినను పోయి రావలె హస్తినకు’’అనేది పాత సామెత నాగేశ్వర్‌ గారు అంటూ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సు బుట్టదాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌ లో నీతి కూడా అంతే’నని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img