Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు జిల్లాల్లో రాళ్ల వర్షం కురియడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు వివేకానంద, సండ్ర వెంకటవీరయ్య,రమణారెడ్డితో కలిసి బీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన పల్లా..అన్ని నియోజకవర్గాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని చెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించార‌నిౌకేసీఆర్ ప్ర‌భుత్వం రైతు ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. పంట న‌ష్టం అంచ‌నాలు పూర్త‌య్యాక రైతుల‌ను త‌ప్ప‌కుండా త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌న్నారు.

కేంద్రం ఎలాంటి స‌హాయం చేయకున్నా రైతుల‌ను ఆదుకుంటున్నామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా రాష్ట్రానికి బృందాల‌ను పంపించాల‌ని కోరారు. పంట నష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త కేంద్రంపై కూడా ఉంద‌న్నారు. పంట న‌ష్టంపై గ‌తంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచ‌నాలు పంపినా నిధులు ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. కేంద్రం తెచ్చిన ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌తో రైతుల‌కు ఎలాంటి లాభం లేద‌న్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img