సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సాధారణ చార్జీలు ఉండడంతో ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. రెండు రోజుల్లో 5 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. బస్టాండ్ల ఆవరణలో ఉన్న హోటళ్లు, స్టాల్స్‌లో వస్తువులు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవన్నారు.