ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలోమంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్రాజకీయ క్రీడకు తెరలేపిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఆ పార్టీ ట్రాప్‌లో పడొద్దని మంత్రి కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని గ్రామాల్లో ప్రజలు నిలదీయాలి పిలుపు నిచ్చారు. యువత, విద్యార్థులను బీఆర్ఎస్ నుంచి దూరంచేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు.