Monday, January 30, 2023
Monday, January 30, 2023

పదవీ విరమణ చేసిన డీజీపీ మహేందర్‌ రెడ్డి.. కొత్త డీజీపీగా అంజనీకుమార్‌

తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి నేడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అకాడమీలో పరేడ్‌ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్‌ రెడ్డి 36 ఏళ్లపాటు ఐపీఎస్‌గా సేవలందించారు. మహేందర్‌ రెడ్డి స్థానంలో తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీకుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మహేందర్‌ రెడ్డితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అంజనీకుమార్‌ చెప్పారు. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని, ఎన్నో రకాలుగా మహేందర్‌ రెడ్డి తనకు ఆదర్శమన్నారు. ఆయన హయాంలో టెక్నాలజీ వ్యవస్థ అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img