Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

పది, ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు సవరించింది. జేఈఈ మెయిన్‌ తేదీలను మార్చడంతో ఇంటర్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌, మే 7 నుంచి 24 వరకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్‌ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండటంతో ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమైంది.
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ కూడా విడుదలైంది. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల టైం టేబుల్‌..
మే 23(సోమవారం)ఫస్ట్‌ లాంగ్వేజ్‌
మే 24(మంగళవారం) సెకండ్‌ లాంగ్వేజ్‌
మే 25(బుధవారం) థర్డ్‌ లాంగ్వేజ్‌(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం)గణితం
మే 27(శుక్రవారం) భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శనివారం) సాంఘిక శాస్త్రం
మే 30(సోమవారం) ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1
మే 31(మంగళవారం) ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2
జూన్‌ 1(బుధవారం) ఎస్‌ఎస్సెసీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ). ఉదయం 9:30 నుంచి 11:30 వరకు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img