Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలపైనా కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కే. తారకరామారావు అధికారులకు సూచించారు.నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో కలిసి పనిచేయాలని తెలిపారు. పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img