Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

పాతబస్తీలో హై అలర్ట్‌.. భారీగా బలగాల మోహరింపు

నగరంలోని పాతబస్తీ‌లో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులను, సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ ఫోర్స్‌ను ఉంచారు. ఫలక్‌నుమా, చంద్రాయన్ గుట్ట అలియాబాద్, శాలిబండ, మొగల్‌పురా, హుస్సేన్ అలం, పట్టార్ గడ్డి, మదీనా దారుషిఫా, డబ్బీర్పుర, మురిగి, చౌక్ మిరాల మండి తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img