Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

పాలమూరు పనులకు ఓకే – రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీం స్టే.

.హైదరాబాద్‌-తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు గతంలో ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పాలమూరు-రంగారెడ్డి ‘‘తాగునీటి ప్రాజెక్టు’’ పనులు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీం కోర్టు. జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎమ్‌.ఎమ్‌. సుందరేష్‌ లతో కూడిన ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ‘‘తాగునీటి’’ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని 2006 లో కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. 2006 వ సంవత్సరం, సెప్టెంబర్‌ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ‘‘పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన’’ స్పష్టం చేసిన అంశాలను సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో . ‘‘రిజర్వాయర్‌ లెవల్‌’’ వరకు నిర్మాణ పనులు కొనసాగేందుకు అనుమతులు ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img