Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఘోర ప్రమాదం

ఐదుగురి మృతి, ఒకరికి గాయాలు
బ రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు మృతదేహాల తరలింపు
కార్మికుల ఆందోళన బ సీఎం దిగ్భ్రాంతి
ప్యాకేజీ వద్ద పోలీసుల మోహరింపు

పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికుల బతుకులు చీకటి పాలయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్‌ -1 అయిన రేగుమాన్‌ గడ్డలో గురువారం అర్థ్ధరాత్రి ప్రమాదం సంభవించింది. ప్యాకేజీలో పనులు చేసేందుకు వెళ్లగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు బీహార్‌ కార్మికులు మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికుల బతుకులు చీకటి పాలయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్‌ -1 అయిన రేగుమాన్‌ గడ్డలో గురువారం అర్థ్ధరాత్రి ప్రమాదం సంభవించింది. ప్యాకేజీలో పనులు చేసేందుకు వెళ్లగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు బీహార్‌ కార్మికులు మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికుల బతుకులు చీకటి పాలయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్‌ -1 అయిన రేగుమాన్‌ గడ్డలో గురువారం అర్థ్ధరాత్రి ప్రమాదం సంభవించింది. ప్యాకేజీలో పనులు చేసేందుకు వెళ్లగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు బీహార్‌ కార్మికులు మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సుమారు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
గురువారం రాత్రి సుర్జ్‌ పుల్‌ వద్ద పనిచేసేందుకు ఆరుగురు కార్మికులు క్రేన్‌ సహాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. క్రేన్‌ తాడు తెగిపోవడంతో వారంతా కిందపడి మృత్యువాత పడినట్లు తెలిపారు. ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్‌(45), ప్రవీణ్‌(38), కమలేష్‌ (36), బీహార్‌కు చెందిన సోనుకుమార్‌(36 ), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీను (40) ఉన్నట్లు సమాచారం. కార్మికులకు విషయం తెలిస్తే పెద్దదవుతుందన్న భయంతో కాంట్రాక్టర్లు వెంటనే పోలీసుల సహకారంతో మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాలను ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారని కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పి ఆందోళన విరమింప చేశారు. విషయం తెలుసుకున్న మీడియాతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఎవ్వరిని లోపలికి అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. దింతో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైఎస్‌ ఆర్టిపీ అధ్యక్షురాలు షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img