విద్యార్థులకు లేఖ రాసిన సాంకేతిక విద్య కమిషనర్ సి.నాగరాణి
పాలిటెక్నిక్ విద్యను ఎంచుకొని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని విద్యను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొంది రాష్ట్ర మరియు దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ప్రతి విద్యార్థికి పేరుపేరునా లేఖ.రాసినట్లు ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కే. అశ్రాఫ్అలీ తెలిపారు. కమిషనర్ రాసిన లేఖను బుధవారం పాఠశాలలో విద్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. సాంకేతిక విద్య, డిప్లమా కోర్సులు యొక్క ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులను వారి తల్లిదండ్రులు చేర్పించడం అభినందనీయమని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కమిషనర్ లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు. అత్యధిక శాతం మధ్య తరగతి వర్గాల కు చెందినవారు ఈ సాంకేతిక విద్యలో ప్రవేశించడం అభినందనీయమని బీటెక్ విద్యార్థులతో సమానంగా వేతనాలను పొందే అవకాశాలు ఉన్నాయని తాము కూడా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించి వారి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆమె పేర్కొనడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఈ శాఖాధిపతి సురేష్ బాబు, అధ్యాపకులు పి చంద్రం బాబు, జి సురేష్, జి రాజేష్, కుమార్ బి చంద్రమోహన్ అనిల్ చైతన్య కుమార్ రెడ్డి, సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం జి రాజేష్,రామానాయుడు చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.